సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 22 నవంబరు 2021 (17:48 IST)

శ్రీవారి భక్తులు ఆందోళన వద్దు, ఈ నెలలో రాలేని భక్తులు వచ్చే నెల దర్శనం: ధర్మారెడ్డి

భారీ వర్షాల కారణంగా టిక్కెట్లు ఉండి శ్రీవారిని దర్శించుకోలేకపోయిన భక్తులకు వచ్చే నెల అవకాశం ఇస్తున్నట్లు టిటిడి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి చెప్పారు. 18 నుంచి 30వ తేదీ లోపు శ్రీవారి దర్శనానికి రాలేని భక్తులకు మరొక అవకాశం కల్పిస్తామన్నారు.

 
ఇందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామనీ, టిక్కెట్ నెంబర్ ఎంటర్ చేస్తే 6 మాసాల్లోపు వేరొక స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. టీటీడీ చైర్మన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 

 
అధిక వర్షపాతం నమోదైనా.... ఒకటి రెండు ప్రదేశాల్లో మినహా మరెక్కడా ఆస్థి నష్టం జరగలేదని.. భక్తులు నిర్భయంగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చునన్నారు. 

 
వరదల కారణంగా 13 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని.. అలిపిరి నడక మార్గంలో ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నారు.  శ్రీవారి మెట్టు వద్ద నాలుగు కల్వర్టులు దెబ్బతిన్నాయని.. కల్వర్టులను మరమత్తులు చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. 

 
శ్రీవారి మెట్ల మార్గం తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుందని.. అలిపిరి మెట్ల మార్గం నుంచి భక్తులు తిరుమలకు రావొచ్చన్నారు. 26వ తేదీ మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇంజనీర్ విభాగాన్ని హెల్త్ డిపార్ట్మెంట్‌ను అప్రమత్తం చేసామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.