గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (13:30 IST)

పక్కింటి ఆంటీ దక్కేలా చూడు దేవుడా.. ఆలయంలో యువకుడి మొక్కు.. ఎక్కడ?

కర్ణాటకలోని హసన్లో ఉన్న హసనాంబ ఆలయంలో కొందరు భక్తులు విచిత్రమైన కోరికలు కోరారు. ఆలయ నిర్వాహకులు హుండీని తెరిచి చూడగా .. అందులో భక్తుల కానుకలతో పాటు .. కొన్ని చీటీలు బయటపడ్డాయి.

ఇందులో తమ ఎమ్మెల్యేను మార్చేయాలని ఒకరు కోరగా .. తమ కాలనీలో గుంతలు పడ్డాయని మరొకరు రాశారు. ఓ యువతి తాను ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి జరిపించాలని రక్తంతో చీటీ రాసింది. తనకు పక్కింటి ఆంటీ దక్కేలా చూడాలంటూ బీటెక్ చదువుతున్న ఓ కుర్రాడు కోరుకున్నాడు.

తను హీరో అవ్వాలని ఓ యాభయ్యేళ్ల వ్యక్తి మొక్కుకున్నాడు. హసనాంబ ఆలయాన్ని ఏడాదిలో 9 రోజులు మాత్రమే తెరుస్తారు.