గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 13 డిశెంబరు 2021 (10:05 IST)

ఏపీకి కేంద్ర టూరిజం శాఖ ఐటీడీసీ ప్యాకేజీలు నిల్

తిరుపతి తిరుమల ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్ర పర్యాటక శాఖ ఎలాంటి ప్యాకేజీ లు నిర్వహించటం లేదని  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి వేసిన అన్ స్టార్డ్ ప్రశ్నలకు సమాధానంగా తిరుపతి, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు అసెంబ్లీ నియోజవర్గాల్లోని తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర ప్రాచీన వారసత్వ ఆలయాల సందర్శనకు ఇండియన్ టూరిజం కార్పొరేషన్ ఏమైనా ప్రత్యేక ప్యాకేజిలు నిర్వహించటం లేదని స్పష్టం చేశారు.
 
 
ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ పర్యాటక రంగం (రూరల్ టూరిజం) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టనున్నారు తీసుకున్న చర్యలు తెలియజేయాలని ప్రశ్నించగా, రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. "కేంద్ర ప్రభుత్వం తిరుమలతో సహా ఎం పి మద్దిల గురుమూర్తి పేర్కొన్న నియోజకవర్గాల‌లోని ప్రాచీన ఆయాల పర్యాటకులు సందర్శనకు ఎలాంటి ప్యాకేజీ లు నిర్వహించటం లేదు. ఐటీడీసి ఇండియన్ టూరిజం అధికారికంగా ఎలాంటి ప్యాకేజీలు నిర్వహించటం లేదు. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ మాత్రమే ప్యాకేజీ లు తిరుమలకు నిర్వహిస్తున్నాయి. 
 
 
అలాగే ఆంద్రప్రదేశ్ లో గ్రామీణ పర్యాటక రంగం అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వలేదు. కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన కూడా లేదు. కేరళకు 88 కోట్లు, బీహార్ కు 44 కోట్ల రూపాయలతో గ్రామీణ పర్యాటక ఆకర్షణల ప్రాజెలు మాత్రం మంజూరు చేశామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు.