బాలీవుడ్ నటి స్వర భాస్కర్‌కు కరోనా వైరస్  
                                       
                  
                  				  దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మహేశ్ బాబు, మంచు లక్ష్మి, కరీనా కపూర్, ఏక్తా కపూర్ వంటి స్టార్స్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కు వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 
 				  											
																													
									  
	 
	తనకు కోవిడ్ అని తేలిందని.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్వరభాస్కర్ తెలిపింది. జ్వరం, తలనొప్పితో బాధపడుతున్నా. రుచిని కోల్పోయా. కొన్ని రోజులుగా నన్ను కలసిన వారికి టెస్టులు చేయించుకోవాలి' అని స్వర విజ్ఞప్తి చేసింది. 
				  
	 
	డబుల్ మాస్క్ ధరించి అంరదూ సురక్షితంగా ఉండాలని కోరింది. ఇప్పటికే తాను డబుల్ డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నందున త్వరలోనే నెగెటివ్ వస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.