బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:54 IST)

కుల గజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తోంది...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌నికిమాలిన రాజ‌కీయాలు చేసే టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేద‌ని రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ విమ‌ర్శించారు. నెల్లూరులో టీడీపీ నేతలపై మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. పోలవరంపై టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 
2018లో పోలవరం నుంచి నీటిని విడుదల చేస్తామని చెప్పిన మాజీ మంత్రి దేవినేని ఉమా చేతులెత్తేశాడని, అతనిపై ఎందుకు సోష‌ల్ మీడియాలో ల్ట్రోల్ చెయ్యరని ప్రశ్నించారు. పోలవరం ఎందుకు ఆలస్యం అయ్యిందో మీకు తెలియదా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. డయా ఫ్రమ్ వాల్, కాంక్రీట్ వాల్ నాణ్యత లోపం వాస్తవం కాదా అని నిలదీశారు. 
 
 
పోలవరంపై నెటిజన్లు ఎవరూ ట్రోల్ చేయడం లేదని,  అంతా టీడీపీ నేతలే చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు నిజాలు చెప్పే ధైర్యం లేదని, దమ్ముంటే వాస్తవాలు ట్రోల్‌ చేయాలని సవాల్‌ విసిరారు. టీడీపీ చెంచా మీడియా అసత్య కథనాలు జనం నమ్మరని స్పష్టం చేశారు. కుల గజ్జితో పసుపు మీడియా తప్పుడు రాతలు రాస్తోందని రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ధ్వజమెత్తారు.