గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 1 జనవరి 2022 (20:09 IST)

నెల్లూరు వెంకటాచలంలో ఘోర ప్రమాదం: కారుతో సహా సజీవ దహనమైన వ్యక్తి

నూతన సంవత్సరం వేళ నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కారుతో సహా సజీవ దహనమయ్యాడు. వెంకటాచలం గొలగమూడి రైల్వే గేటుకి సమీపంలో కారు మంటల్లో మండుతుండటంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక దళాన్ని రంగంలోకి దింపి మంటలను ఆర్పేశారు. ఐతే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ఓ వ్యక్తి కూడా సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 
ఎవరైనా దుండగులు వ్యక్తిని హత్య చేసి కారుతో సహా నిప్పంటించారా లేదంటే ఆ వ్యక్తే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వ్యక్తిది నెల్లూరు అని గుర్తించారు. దీనితో అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.