సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (10:19 IST)

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు కార్మికుల మృతి

జార్ఖండ్‌లో‌ చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..  జార్ఖండ్ పాలం జిల్లాలోని హరిహరగంజ్‌లో పికప్ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాద ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు కూలీలు మృతి చెందారు. 
 
ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ముగ్గురు మహిళలు చికిత్స పొందుతూ మరణించారని ప్రమాద స్థలానికి చేరుకున్న హరిహరగంజ్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ జైప్రకాష్ నారాయణ్ తెలిపారు. హరిహరగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో 12 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారని హరిహర్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుదామ కుమార్ దాస్ తెలిపారు. 
 
పాలం జిల్లాలోని పంకికి చెందిన కార్మికులు పొరుగున ఉన్న బీహార్‌లోని సిహుడి గ్రామంలో వరి కోత తర్వాత తమ గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.