గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మొయినాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. 16 యేళ్ల యువతి మృతి

తెలంగాణ రాష్ట్రంలోని మొయినాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 యేళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొయినాబాద్ నుంచి చేవెళ్ల వెళుతున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 యేళ్ల ప్రేమిక అనే యువతితో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 
 
కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ప్రేమిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 24 గంటలు గడిస్తేగానీ ఏపీ చెప్పలేమని వైద్యులు తేల్చారు. ఈ గాయపడిన వారిలో అక్షర (14) 9వ తరగతి చదువుతుండగా, సౌమ్య (18) అనే విద్యార్థిని డిగ్రీ చదవుతోంది. చనిపోయిన ప్రేమిక మాత్రం ఇంటర్ మొదటి సంవత్సరం. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు కావడం గమనార్హం.