శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (13:43 IST)

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

నల్గొండలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలంకు చెందిన అన్నాచెల్లెళ్లు ధనావత్ అంజి(20), ధనావత్ అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 
 
బొత్తలపాలెం వద్దకు రాగానే ముందు ఉన్న ట్రాక్టర్‌ని బైక్‌ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. మనవడితో సహా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.