మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జనవరి 2022 (14:50 IST)

బెంబేలెత్తిస్తున్న మంకీ ఫీవర్: కర్నాటకలో తొలికేసు నమోదు

కర్నాటకను ఒకవైపు కరోనావైరస్ కుదిపేస్తుంటే మరోవైపు కొత్తగా మంకీ ఫీవర్ ఎటాక్ చేస్తోంది. కర్ణాటక తీర్థహళ్లిలోని కుడిగే గ్రామంలో 57 ఏళ్ల మహిళ క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (మంకీఫీవర్)తో ఆసుపత్రిలో చేరింది. రోగి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.

 
ఆ తర్వాత ఆమె రక్త నమూనా సేకరించి పరీక్షించగా మంకీ ఫీవర్ అని తేలింది. ఈ వైరస్ కోతుల ద్వారా వ్యాపిస్తుందని వైద్యులు చెపుతున్నారు. మరి ఈ ఫీవర్ మరి ఇంకెంతమందికి వ్యాపించిందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.