మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (11:41 IST)

తెలంగాణలో ఘోర ప్రమాదం : ఐదుగురు మృతి

తెలంగాణలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్తుండగా.. గట్టమ్మ ఆలయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హ‌నుమ‌కొండ డిపోకు చెందిన ఆర్టీసీ బ‌స్సు మేడారం నుంచి తిరుగు ప్రయాణ‌మైన స‌మ‌యంలో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై నుంచి కారును పక్కకు తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఈ ప్రమాదంతో గట్టమ్మ ఆలయ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసుల ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన మేడారం జాతర నేటితో ముగియనున్న సంగతి తెలిసిందే.