బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:25 IST)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో...

చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.