గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 21 మార్చి 2022 (11:13 IST)

రాజుగారి గది 4 చిత్రంలో మిత్రా శర్మ - ఓంకార్ ప్రకటన

Mitraw Sharma
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ ప్రారంభం అయిన మూడు వారాలకే మిత్రా శర్మ తన ఆటతీరు, ప్రతిభ, గ్లామర్ తోపాటు ప్రత్యేక వ్యక్తిత్వంతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కి గెస్ట్ గా వచ్చిన ఓంకార్, మిత్రా శర్మ కి రెడ్ కలర్ హార్ట్ బొమ్మ ఇచ్చి “అది ఎవరి హార్ట్ అనుకుంటున్నావ్? నాది, ఎందుకంటే నువ్వే బెస్ట్ కంటెస్టెంట్, నా హార్ట్ నువ్ గెల్చుకున్నావ్, నీలో ఎంతో జెన్యూన్ ప్రేమ ఉంది అందుకే నా హృదయం ఇచ్చా “అని చెప్పుకొచ్చారు.

నామినేషన్స్ లో అందర్నీ నవ్వించేలా చేసిన ఏకైక కంటెస్టెంట్ అనీ, బిగ్ బాస్ సీజన్స్ లో కేవలం మిత్రా శర్మ ఒక్కరే అని చెప్పుకొచ్చారు. ఎంతో మందిని నవ్వించే శక్తి నీలో ఉంది , నా తదుపరి సినిమా రాజు గారి గది 4 లో నువ్వే హీరోయిన్, నీ పెర్ఫార్మెన్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించగలవు అని వ్యక్తం చేసాడు. మొత్తానికి అందాల ముద్దుగుమ్మ మిత్రా శర్మ మంచి ఛాన్స్ కొట్టేసింది.