అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు కాదు.. నవీన్ యాదవ్‌కే మద్దతు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వలేదని నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా మద్దతు ఇచ్చామని తెలిపారు. చాలా మంది ప్రజలు మరోలా భావించారని ఒవైసీ అన్నారు.
బీఆర్ఎస్‌తో ఎంఐఎం పార్టీకి ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్, తాను ఇద్దరూ తమ తమ పార్టీల ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు.
నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ సీటును మాగంటి సునీతపై 25,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకున్నారు. ఎంఐఎం పార్టీ మద్దతు ఆయనకు అన్ని ముస్లిం ఓట్లను పొందడంలో సహాయపడిందని, ఇది ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.