సోమవారం, 17 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 17 నవంబరు 2025 (16:33 IST)

రాజకీయాల్లోకి వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్, ఏ పార్టీలో చేరుతారు?

Vangaveeti Asha Kiran
వంగవీటి రంగా అంటే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తెలియని వారుండరు. విజయవాడలో ఆయన హవా ఓ స్థాయిలో నడిచింది. రంగా వారసులుగా ఆయన భార్య వంగవీటి రత్నకుమారి కొన్నాళ్లు రాజకీయాల్లో వున్నారు. ఆ తర్వాత రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వచ్చారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీలో వున్నారు. ఇంకోవైపు రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడుగా వున్న వంగవీటి నరేంద్ర వైసిపీలో కొనసాగుతున్నారు. ఈయనకు చెక్ పెట్టేందుకే వంగవీటి ఆశాకిరణ్ రంగంలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ఐతే తన రాజకీయ ప్రవేశంపై ఆశా మాట్లాడుతూ... నా తండ్రి నడిచిన బాటలో పయనిస్తాను. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి మా నాన్న సాయం చేసేవారు. నిస్వార్థమైన ప్రజాసేవ చేయబట్టే ఇన్నేళ్లయినా ఆయనకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. రంగా అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా వున్నారు. అందుకే ఆయన బాటలో నడుస్తూ ప్రజా సేవకు అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకూ కొన్ని బాధ్యతల కారణంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఐతే ఇకపై పూర్తిస్థాయిలో ప్రజల మధ్య వుండాలని నిర్ణయించుకున్నాను. నేను ఏ పార్టీలో చేరుతానన్నది ఇప్పుడే చెప్పలేను. రాధారంగా మిత్రమండలితో చర్చించిన మీదట ఓ నిర్ణయానికి వస్తాను అని చెప్పారు.