సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (12:39 IST)

దేశంలో స్థిరంగా చమురు ధరలు - తెలుగు రాష్ట్రాల్లో హెచ్చుతగ్గులు

దేశంలో పెట్రోల్, డీజల్ చమురు ధరలు స్ధిరంగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ చమురు ధరలు పెంచుతారనే ప్రచారం జరిగింది. అయితే, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం రంగ చమురు కంపెనీలు ఈ పెట్రోల్ ధరల పెంపు జోలికి వెళ్లలేదు. ఫలితంగా గత కొన్ని రోజులుగా ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.95.41గా ఉండగా, డీజల్ ధర రూ.86.67గా వుంది. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.109.98గా ఉండగా, లీటరు డీజల్ ధర రూ.94.14గా ఉంది. అలాగే, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.104.67గాను, డీజల్ ధర రూ.89.79గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.101.40గాను డీజల్ ధర రూ.91.43గా ఉంది. 
 
ఇకపోతే, హైదరాబాద్ నగరంలో పెట్రోల్ లీటరు ధర రూ.108.20గాను, డీజల్ ధర రూయ.94.62గా, విజయవాడలో పెట్రోల్ లీటరు ధర రూ.110.91, డీజల్ ధర రూ.96.38గా ఉంది.