ఏప్రిల్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు!
ఏప్రిల్‌లో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలవులు రానున్నాయి. ఏప్రిల్‌లో వరుసగా రెండు వారాంతాల్లో బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. మొత్తానికి వచ్చే ఏప్రిల్‌లో 9 రోజులు బ్యాంకులకు సెలవులు వున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ, సహకార, ప్రాంతీయ బ్యాంకులన్నింటికీ ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం సెలవులు వర్తిస్తాయి.
ఏప్రిల్ ఒకటో తేదీ ఆర్థిక సంవత్సరం తొలి రోజు.. అదే రోజు పాత ఆర్థిక సంవత్సర ఖాతాల ముగింపు కావడంతో బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 2వ తేదీ తొలి శనివారం అయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంవత్సరాది, మహారాష్ట్రలో గుడి పడ్వా, కర్ణాటకలోనూ ఉగాది పర్వదినం జరుపుకుంటారు. కనుక 2వ తేదీన కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 3వ తేదీన ఆదివారం వారాంతపు సెలవు.
ఏప్రిల్ 14, 15 తేదీల్లో బ్యాంకులకు సెలవు. 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి, మహావీర్ జయంతి, తమిళ నూతన సంవత్సరాది కావున బ్యాంకులు పనిచేయవు.
15వ తేదీన గుడ్ ఫ్రైడేతోపాటు బెంగాల్ నూతన సంవత్సరాది, హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. 17వ తేదీ ఆదివారం సెలవు. అంతకుముందు 9వ తేదీన రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం వారాంతపు సెలవుల సందర్భంగా బ్యాంకులు పని చేయవు.
ఏప్రిల్ 23వ తేదీ నాలుగో శనివారం, 24వ తేదీ ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు. వీటిల్లో రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు మినహా మిగతా సెలవు దినాల్లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులు పని చేయవు.