సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-03-2022 గురువారం రాశిఫలాలు - దత్తాత్రేయుడని ఆరాధించి మీ సంకల్పం...

మేషం :- అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యంతో ఏకీభావం లోపిస్తుంది. పొట్ట, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బ్యాంక్ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
 
వృషభం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. షేర్ల క్రయ విక్రయాల్లో పునరాలోచన చాలా అవసరం. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. రుణాలు చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
మిథునం :- ఉద్యోగస్తులు ఆశిస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ కళత్ర మొండి వైఖరి వల్ల ఇబ్బందులకు గురవుతారు. మిమ్మల్ని పొగడేవారే కానీ సహకరించే వారుండరన్న వాస్తవం గ్రహించండి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరం. పన్నులు, బీమా బిల్లులు పరిష్కారం అవుతాయి.
 
కర్కాటకం :- రిప్రజెంటిట్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆశాజనకం. దంపతుల మధ్య నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. విద్య, వైజ్ఞానిక రంగాలలోని వారికి జయం చేకూరుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులు తప్పవు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు.
 
సింహం :- స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనలకు గురవుతారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. స్త్రీలు వాదోపవాదాలకు దిగడం వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి.
 
కన్య :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళుకువ అవసరం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
తుల :- వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మీచేతుల మీదుగానే సాగుతాయి. రావలసిన ధనం వాయిదాపడుతుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. జీవిత భాగస్వామి ఆర్యోగము ఆందోళన కలిగిస్తుంది.
 
వృశ్చికం :- ఒక పుణ్యక్షేత్రం సందర్శించాలనే కోరిక స్ఫురిస్తుంది. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోయి ఉల్లాసంగా గడుపుతాయి. ఉద్యోగస్తులు పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
ధనస్సు:- మందులు, రసాయనాలు, ఆల్కహాలు, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. దీర్ఘకాలింగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి.
 
మకరం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. ఎప్పటి నుండో ఆగి వున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. రాజకీయనాయకులు విరోధులు వేసే పథకాలు తెలివితో త్రిప్పి గొట్టగలుగుతారు. మీ కళత్ర మొండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది.
 
కుంభం :- ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత బాకీల వసూలు విషయంలో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కుంటారు. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనకతప్పదు.
 
మీనం :- అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు. సోదరీ సోదరుల మధ్య ఆస్తి పంపకాల ప్రస్తావన వస్తుంది. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట అధికమవుతాయి.