సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-03-2022 బుధవారం రాశిఫలాలు - సత్యదేవుని పూజించి అర్చించినా...

మేషం :- ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు, పనిభారంతో సతమతమవుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
వృషభం :- వృత్తినైపుణ్యం పెంచుకునేందుకు కృషిచేయటం ఎంతైనా అవసరం. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. అవివాహితుల ఆలోచనలు పలువిధాలుగా ఉంటాయి.
 
మిథునం :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ట్రాన్సుపోర్టు, ఆటోమోబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థత, వినయం అధికారులను ఆకట్టుకుంటాయి. విద్యార్థులలో తొందరపాటు తనం కూడదు. స్త్రీలతో మితంగా సంభాషించడం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు. ప్రియతములలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు. రిప్రజెంటేటివ్‌లకు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, తిప్పట తప్పవు. విద్యార్థులు రేపటి గురించి ఆందోళన చెందుతారు.
 
సింహం :- విద్యార్థుకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. కంది, నూనె, మిర్చి వ్యాపారులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. స్త్రీలు ఎదుటివారి తీరును గమనించి వ్యవహరించటం మంచిది. ఆదాయం పెంచుకునేందుకు చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి.
 
కన్య :- వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. సోదరీ, సోదరులతో ఒక అవగాహనకు వస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో మెలకువ వహించండి. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొలైబ్, మెకానికల్ రంగాల్లో వారికి ఆశాజనకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం.
 
తుల :- బంధు మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలలో లాయర్లు క్లయింట్ల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగంలోని వారికి ఏకాగ్రత చాలా అవసరం. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమాధిక్యత తప్పవు.
 
వృశ్చికం :- వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. స్త్రీలకు ఇరుగు, పొరుగు వారితో సఖ్యత అంతగా ఉండదు. విదేశీ యత్నాలలో స్వల్ప ఆటంకాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, లభిస్తుంది. బ్యాంకు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
ధనస్సు :- తొందరపాటుతనం వల్ల కుటుంబీకులు, అవతలి వారితో మాటపడవలసి వస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. స్త్రీలకు పనిభారం అధికం. దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. వృత్తిపరమైన ప్రయాణాలు, సరకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి.
 
మకరం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం లభిస్తుంది. ధనం నిల్వ చేయాలనే మీ సంకల్పం నెరవేరదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
కుంభం :- ఉపాధ్యాయులకు, ప్రైవేటు సంస్థల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, పానియ వ్యాపారులకు కలిసివస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. చిన్నారుల, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చులు అంచనాలు మించుతాయి.
 
మీనం :- ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి. స్త్రీలకు షాపింగ్ లోను, వస్తు నాణ్యత ఎంపికలోను ఏకాగ్రత అవసరం. పత్రిక, ప్రైవేటు సంస్థల్లో వారికి యాజమాన్యం నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.