శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (10:53 IST)

సామాన్యుడికి మరో షాక్.. భారీ ద్రవ్యలోటుతో...?

సామాన్యుడికి తెలంగాణ సర్కార్ షాకిచ్చేలా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు పెరగని విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం పెరగనున్నాయి. భారీ ద్రవ్యలోటుతో డిస్కంలు కొట్టుమిట్టాడుతుండటంతో తప్పడం లేదని స్పష్టం చేస్తోంది. 
 
పెరిగిన రేట్లు ఏప్రిల్ తొలివారంలో అమలుకు రానుంది. పెరిగిన రేట్లతో ఆ మొత్తం 132 రూపాయల 41 పైసల బిల్లు రానుంది. అంటే దాదాపు 40 రూపాయల బిల్లు అదనంగా వస్తుందన్నమాట. 
 
99 యూనిట్లు వాడే వాళ్లకి ఇప్పటిదాకా 286 రూపాయల బిల్లు వస్తే ఇప్పుడా మొత్తం 361కి చేరుకోనుంది. అంటే.. 75 రూపాయలు అదనంగా చెల్లించాలన్నమాట. 400 యూనిట్లపైన కరెంట్ వాడే వినియోగదారులకు తడిసి మోపెడు కానుంది.