సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (16:35 IST)

తెలంగాణా రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు

తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెరగనున్నాయి. ఈ పెంపుదల 14 శాతం మేరకు ఉంది. ఈ మేరకు టీఎస్‌ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. విద్యుత్ డిస్కింలు 19 శాతం పెంచేందుకు అనుమతి కోరగా ఈఆర్సీ మాత్రం 14 శాతం మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
డొమెస్టిక్‌ వినియోగదారులపై యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు, ఇతర కేటగిరీలకు చెందిన వినియోగదారులపై యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కింలు కోరారు. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతం మేరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 
 
అయితే, తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి చెంద్రశేఖర్ రావు తీసుకోవాల్సివుంది. విద్యుత్ బోర్డులతో పాటు ఈఆర్సీలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు సమ్మతించాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా ఈ పెంపునకు ఆమోదం తెలిపితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ చార్జీలు పెరగనున్నాయి.