గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (10:33 IST)

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పది మంది న్యాయమూర్తులు

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా పది మంది న్యాయమూర్తులను నియమిస్తూ భారత రాష్ట్రపతి కార్యాలయం ఆర్డర్‌ కాపీ విడుదల చేసింది. వీరితో పాటు ఐదుగురు న్యాయవాదులు, మరో ఐదుగురు న్యాయాధికారులను నియమించారు. 
 
ఫిబ్రవరి 1వ తేదిన సుప్రీంకోర్టు కొలీజియం ఏడుగురు న్యాయవాదులు, 5 మంది జ్యుడీషియల్ అధికారుల పేర్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది. 
 
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులతో వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌‌‌‌నాథ్‌‌‌‌ కోవింద్‌‌‌‌ ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ హైకోర్టులో సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య గతంలో 19 ఉండగా కొత్తగా చేరిన 10మందితో కలిపి ఆ సంఖ్య 29కి చేరింది.