మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 మార్చి 2022 (16:13 IST)

చట్ట విరుద్ధంగా స్టిక్కర్లు ఉంటే చర్యలే : హైదరాబాద్ పోలీసులు

చట్ట విరుద్ధంగా తమ వాహనాలకు స్టిక్కర్లు అంటించుకునే వాహనదారులపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బోధన్ ఎమ్మెల్యే షకీర్ పేరుతో కారు స్టిక్కర్ ఉన్న కారు ఒకటి హైదరాబాద్ నగరంలో బీభత్సం సృష్టించిన విషయం తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్లు వేసుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రూ.వెయ్యి అపరాధం విధించడమే కాకుండా మోటార్ వెహికల్ చట్టం కింద కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం జారీచేశారు.