ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 17 డిశెంబరు 2021 (11:51 IST)

భవిష్యత్తులో ఎలెక్ట్రిక్ వాహనాల‌దే హ‌వా!

ప్ర‌పంచంలో భ‌విష్య‌త్తులో ఎల‌క్ట్రీక్ వాహ‌నాల‌దే పైచేయి అని, బ్యాట‌రీ వాహ‌నాల రంగం అభివృద్ధి చెందుతుంద‌ని విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. విజ‌య‌వాడ‌లో ఎలక్ట్రికల్ వెహికల్ షోరూం ను ఎమ్మెల్యే ప్రారంభించారు. గాంధీనగర్ లో నేడు జాంగిడ్ మోటార్స్-ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంను ప్రారంభించారు. 
 
 
కాలుష్య రహితమైన ఎలెక్ట్రికల్ వెహికల్ వాడటం వలన ప్రకృతిని కాపాడటం జరుగుతుందని అన్నారు , భవిష్యత్తులో ఎలెక్ట్రికల్ వాహనరంగం అభివృద్ధి చెందుతున్నదని పేర్కొన్నారు. బాలి గోవింద్, ఉద్దంటి సునీత సురేష్,పి.కృష్ణ, గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ, తోలేటి శ్రీకాంత్,పెంటి నాగరాజు, చేవూరి రామస్వామి, తాటికొండ రంగబాబు, చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు.
 
 
జాంగిడ్ మోటార్స్ అధీకృత  డీలర్ బ్రహ్మాస్ ఈ మోటార్స్ యజమాన్యంను అంద‌రూ అభినందించారు. పి.బ్రహ్మేశ్వరరావు, కొండముది బంగారు బాబు, సిద్ధార్థ శ్రీపల్లి, సిబ్బంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.