గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (13:43 IST)

చెత్తబుట్టతో టీచర్‌పై దాడి.. స్టూడెంట్స్ ఓవరాక్షన్.. వీడియో వైరల్

పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు నీచంగా ప్రవర్తించారు. టీచర్‌పై బకెట్‌తో విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరే జిల్లా చెన్న‌గిరి తాలూక న‌ల్లూర గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాలూక న‌ల్లూర గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో హిందీ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతుండగా విద్యార్థులు ఈ దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. 
 
పిల్ల‌లు అంత‌గా రెచ్చిపోతున్నా ఆ మాస్టారు కాస్త‌యినా కోపం తెచ్చుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. టీచర్‌పై బకెట్‌తో దాడి చేసినా ఆ మాస్టారు భరించాడు. అయివా ఆ విద్యార్థులు తగ్గలేదు. చెత్త బ‌కెట్‌ను ఆ ఉపాధ్యాయుడి త‌ల‌పై పెట్టి వీడియో కూడా తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.
 
ఆ పిల్ల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ముఖులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థులు హిందీ టీచ‌ర్ ప్ర‌కాశ్‌ను గ‌తంలోనూ వేధించిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా వీడియో వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. టీచ‌ర్‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విద్యార్థుల‌కు టీసీలు ఇచ్చి పంపించారు.