1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (12:24 IST)

తొమ్మిది మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్: ఇకపై అలాంటి విద్యార్థులకే ఎంట్రీ

కరోనా వైరస్ పోయిందని అనుకుంటున్నాం కానీ అది ఇంకా పొంచే వుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా వెంటనే పట్టుకుంటుంది. తాజాగా చెన్నైలో ఇదే జరిగింది.

 
కోవిడ్ మార్గదర్శకాలను గాలికి వదిలేస్తుండటంతో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటీవలి చెన్నైలోని అన్నా యూనివర్శిటిలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వర్శిటీ అధికారులు ఆందోళన చెందారు.


మరోవైపు విద్యాశాఖా మంత్రి వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇకపై కరోనా రెండు డోసులు టీకాలు వేసుకున్న వారిని మాత్రమే కళాశాలలోకి అనుమతించాలని ఆదేశించారు. ఇప్పటివరకూ కేవలం 46 శాతం మంది విద్యార్థులు మాత్రమే మొదటి డోస్ టీకా వేసుకున్నట్లు మంత్రి తెలిపారు.

 
విద్యార్థులు కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా విద్యాలయాలు చూడాలని సూచించారు. విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ ఒకచోట గుమిగూడి పార్టీలు వగైరా చేసుకునే అవకాశం ఇవ్వవద్దని చెప్పారు.