శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:01 IST)

దేశంలో కొత్తా నమోదైన పాజిటివ్ కేసులెన్ని?

దేశంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఒక ప్రకటనను చేసింది. ఈ ప్రకటన మేరకు గురువారం 9419 పాజిటివ్ కేసులు నమోదు కాగా, శుక్రవారం వెల్లడైన ప్రకటన మేరకు 8503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుంటే మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,74,744కు చేరింది. 
 
మొత్తం కరోనా వైరస్ బాధితుల్లో 3,41,05,066 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 4,74,735 మంది చనిపోయారు. దేశ వ్యాప్తంగా 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 7678 మంది కరోనా నుంచి కోలుకోగా, 624 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.