శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (07:52 IST)

ప్రత్యేక క్లాసుల పేరుతో 17 మంది బాలికలపై ఉపాధ్యాయుడు అత్యాచారం..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన వద్ద చదువుకునే అమ్మాయిలపై కన్నేసిన ఓ కామాంధ ఉపాధ్యాయుడు ప్రత్యేక తరగతుల పేరుతో లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ తంతంగాన్ని వీడియో తీసి, తనకు ఎపుడు పడక సుఖం కావాలంటే అపుడు వీడియో చూపి బెదిరిస్తూ లైంగికంగా అనుభవిస్తూ వచ్చాడు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలో 48 యేళ్ళ ఉపాధ్యాయుడు ఓ ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తున్నాడు. ఈ స్కూల్‌లో చదివే అమ్మాయిలపై కన్నేశాడు. పదో తరగతి విద్యార్థినులకు ప్రత్యేక క్లాసుల పేరుతో 17 మంది అమ్మాయిలను తన ఇంటికి పిలిపించాడు. 
 
ఆ తర్వాత వారిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. పైగా, నగ్న వీడియోలు చిత్రీకరించాడు. ఈ విషయం ఎవికైనా చెబితే మీతోపాటు మీ తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. అలా కొన్ని నెలులుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, కొందరు బాలికలు ధైర్యం చేసి జరిగిన ఘటనను తమ తల్లిదండ్రుకు చెప్పారు. వారంతా కలిసి కామాంధ ఉపాధ్యాయుడుని నిలదీయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ కామాంధ ఉపాధ్యాయుడు ఆ ఊరి పెద్దగా ఉండటంతో పోలీసులు సైతం ఆయనపై చర్యలు తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు.