1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (11:44 IST)

తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో మృతశిశువు!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదేళ్ళ బాలిక కడుపులో ఓ మృతశిశువును వైద్యులు గుర్తించారు. ఈ కారణంగానే ఆ బాలిక విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తేల్చారు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారి అవాక్కయ్యారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని ఖుషీ నగర్‌లోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ళ బాలిక పుట్టినప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో అనేక మంది వైద్యుల వద్ద చూపించారు. కానీ, ఆ నొప్పి ఏమాత్రం తగ్గలేదు. పైగా, మూఢనమ్మకం కలిగిన ఆ బాలిక తల్లిదండ్రులు వివిధ రకాల మంత్రాలు, తంత్రాలు చేయిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ బాలికకు కడుపు నొప్పి అధికం కావడంతో మరోమారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇక్కడ ఆ బాలికకు వైద్యులు స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌లో ఆ బాలిక కడుపులో ఉన్నది గడ్డ కాదని తల, కాళ్లు, చేతులు, కళ్లు ఉన్న ఓ మృతశిశువు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ బాలికకు ఆపరేషన్ చేశారు. అది విజయవంతం కావడంతో ఇకపై ఆ బాలిక తోటివారిలాగే సాఫీగా జీవితాన్ని గడపొచ్చని వైద్యులు వెల్లడించారు.