మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 నవంబరు 2021 (15:19 IST)

పేపర్ లీక్ : ఉత్తరప్రదేశ్ టీచర్ ప్రవేశ పరీక్ష రద్దు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్షను రద్దు చేశారు. ఈ పరీక్ష కోసం తయారు చేసిన పేపర్ లీక్ అయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఏడీజీ ప్రశాంత్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. పరీక్షకు కొన్ని గంటల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 
 
ఆదివారం జరగాల్సిన యూపీటీఈటీ 2021 ప్రవేశ పరీక్ష ప్రశ్న పేపర్ లీక్ అయింది. ఈ కారణంగా ఈ ప్రవేశ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పేపర్ లీక్ కేసులో అనేక మంది అనుమానితులను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తుంది. ఈ పరీక్షను మళ్లీ మరో నెల రోజుల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని ఆయన వెల్లడించారు.