గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (09:27 IST)

యూపీలో మూడో తరగతి బాలికపై టీనేజర్ లైంగికదాడి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగు చూసింది. తొమ్మిదేళ్ళ బాలిక పట్ల ఓ టీనేజర్ అసభ్యంగా ప్రవర్తించాడు. లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఫతేపూర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫతేగఢ్ జిల్లాలోని ఫతేపూర్‌లో 9 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఈ బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉంది. అత్యాచారానికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.