గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (13:56 IST)

హెయిర్ కటింగ్ చేయనని చెప్పినందుకు తుపాకీతో కాల్చేశాడు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. పాతబాకీ చెల్లిస్తేగానీ మళ్లీ హెయిల్ కట్ చేయబోనని క్షౌరకుడు తెగేసి చెప్పాడు. దీంతో షాపుకు వచ్చిన కష్టమర్ ఆ క్షౌరకుడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఈ దారుణం యూపీలోని బులంద్‌షహార్ జిల్లాలోని షరీఫ్‌పూర్ బాయిన్స్‌రోలి అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ గ్రామానికి చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి స్థానికంగా ఒక హెయిర్ కటింగ్ షాపును నడుపుతున్నాడు. ఈయన వద్దకు సమీర్ అనే వ్యక్తి గతంలో పలుమార్లు హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. దీంతో ఇర్ఫాన్‌కు కొంత డబ్బులు బాకీ పడ్డాడు.
 
ఈ క్రమంలో మళ్లీ షాపుకు వచ్చిన సమీర్... కటింగ్ చేయాలని ఇర్ఫాన్‌ను కోరాడు. అందుకు ఆయన నిరాకరించాడు. పాత బాకీ చెల్లిస్తేగానీ కటింగ్ చేయబోనని తేల్చిచెప్పాడు. దీంతో ఆగ్రహించిన సమీర్.. తన వద్ద ఉండే లైసెన్స్ తుపాకీతో కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.