శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (18:21 IST)

ప్రాక్టికల్ పరీక్షలని రప్పించి మత్తుమందు కలిపి 17 మంది బాలికలపై అత్యాచారం

ప్రాక్టికల్స్ పేరిట ప్రిన్సిపల్ 17 మంది బాలికలపై వేధింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముజఫర్‌నగర్ జిల్లాలోని పదో తరగతి చదువుతున్న 17మంది బాలికలపై ప్రిన్సిపల్‌తో పాటు అతని సహచరుడు వేధింపులకు పాల్పడ్డారు. వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 
 
ప్రాక్టికల్స్ పేరిట బాలికలను స్కూలుకు రప్పించే ప్రిన్సిపల్ యోగేష్ కుమార్.. ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయాక.. అకృత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని  ఎవరికైనా చెబితేనే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని.. బెదిరింపులకు పాల్పడేవాడని బాలికలు తెలిపారు. 
 
వాస్తవానికి ఈ ఘటన నవంబర్ 18న చోటుచేసుకోగా.. ఫిర్యాదు స్వీకరణ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం కారణంగా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే ప్రమోద్ జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించారని బాలికల తల్లిదండ్రులు చెప్తున్నారు.