బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (17:03 IST)

లక్నో : కుమార్తెతో పెళ్లికి నిరాకరించిందనీ మహిళ గొంతు కోసేశాడు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కూతురుతో పెళ్లికి నిరాకరించినందుకు ఓ కిరాతకుడు మహిళ గొంతు కోశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని సదత్‌గంజ్ ప్రాంతానికి చెందిన ఆర్మాన్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన షరీఫ జహాన్ అనే మహిళ కుమార్తెను ఇష్టపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. దీంతో జహాన్‌ వద్దకు వెళ్లి కుమార్తెను పెళ్లి చేయాలని కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. 
 
దీంతో ఆగ్రహం చెందిన ఆర్మాన్.. ఆదివారం మధ్యాహ్నం జహాన్ ఇంట్లోకి చొరబడి ఆమెను కత్తితో గొంతుకోశాడు. ఆ తర్వాత ఖాళీ పేపరుపై ఆమె వేలి ముద్రను బలవంతంగా తీసుకుని పారిపోయాడు. అయితే, జహాన్ కేకలు వేయడంతో ఇరుగు పొరుగువారు ఘటనా స్థలికి వచ్చి పోలీసులకు సమాచారం చేరవేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్న కేసును నమోదు చేశారు.