శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (14:42 IST)

రంగారెడ్డిలో కీచక కానిస్టేబుల్.. బాలికపై అత్యాచారం

తెలంగాణా రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో ఓ కీచక కానిస్టేబుల్ వెలుగులోకి వచ్చాడు. యువతుల మానప్రాణాలు కాపాడాల్సిన ఈ కానిస్టేబుల్ ఓ బాలికపై లైంగికదాడి యత్నానికి పాల్పడ్డాడు. కామాంధ కానిస్టేబుల్ చేష్టలకు భయపడిన ఆ బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. 
 
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. శంకర్ పల్లికి చెందిన వడ్డే శేఖర్ కూకట్ పల్లి పోలీస్ స్టేషనులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి దగ్గరకు తీసుకున్న కానిస్టేబుల్ శేఖర్ ఆపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. 
 
ఆ వెంటనే తేరుకున్న బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కీచక కానిస్టేబుల్‌ను చేవెళ్ల ఏసీపీ కార్యాలయానికి తీసుకెళ్లి అప్పగించారు.