శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 6 డిశెంబరు 2021 (18:38 IST)

ఐదు లక్షల మంది బాలికలకు విద్యనందించేందుకు అన్‌అకాడమీ శిక్షోదయ కార్యక్రమం ప్రారంభం

భారతదేశపు అతిపెద్ద అభ్యాస వేదిక అన్‌అకాడమీ నేడు దేశవ్యాప్తంగా తమ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘శిక్షోదయ’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను వేడుక చేస్తూ, భారతదేశపు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఆత్మనిర్భర్‌ సాధించాలనే జాతీయ లక్ష్య సాధన దిశగా అన్‌అకాడమీ యొక్క నిబద్ధతను చాటే కార్యక్రమం శిక్షోదయ్‌.

 
ఈ కార్యక్రమం ద్వారా అన్‌అకాడమీ ఇప్పుడు ‘బేటీ సంగ్‌ బులందీ కీ ఓర్‌’కు కట్టుబడి ఉంది. దీని ద్వారా భారతదేశ వ్యాప్తంగా 5లక్షల మంది బాలికల విద్యకు తోడ్పడటంతో పాటుగా ప్రతిభావంతులైన విద్యార్ధినిలకు సాధికారితనూ అందిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యను ఆపేసిన బాలికలు, ప్రస్తుతం పాఠశాలలు మరియు కళాశాలల్లో చేరడంతో పాటుగా ప్రధానస్రవంతి విద్యలో మిళితమయ్యేందుకు తగిన అవకాశాలను సృష్టించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా చేసుకుంది.

 
శిక్షోదయతో, ఐదు లక్షల మంది బాలికలు తగిన విజ్ఞానం మరియు నైపుణ్యం పొందనున్నారు. ఈ నైపుణ్యాలు తమతో పాటుగా తమ కమ్యూనిటీల అభివృద్ధికి తోడ్పడడంతో పాటుగా భారతదేశపు వృద్ధి కథలో భాగం కావడంతో పాటుగా తమ లక్ష్యాలను చేరుకునేందుకు సైతం తోడ్పడుతుంది. 

 
ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ, ‘‘ఈ భారీ కార్యక్రమం, కేవలం ఐదు లక్షల మంది బాలికలలో మాత్రమే పరివర్తన తీసుకురావడంతో పాటుగా వారి కుటుంబాలు , సమాజంపై కూడా సానుకూల ప్రభావం చూపగలదు. తద్వారా దేశంపై కూడా ప్రభావం చూపుతుంది. సృజనాత్మక, అందుబాటు ధరలలోని పద్ధతుల ద్వారా విద్యను సమూలంగా మార్చే సామర్థ్యం ఎడ్‌టెక్‌కు ఉంది.

 
అంతేకాదు, ప్రతి చిన్నారి నాణ్యమైన విద్యను పొందేందుకు శక్తివంతమైన పాత్రనూ ఇది పోషిస్తుంది. అన్‌అకాడమీ, ఈ సాంకేతిక శక్తిని వినియోగించుకోవడాన్ని  లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో  మారుమూల ప్రాంతాలలో సైతం నాణ్యమైన విద్యను అందించగలదు. శిక్షోదయ అనేది ఓ మహోన్నత కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా అన్‌అకడామీ కేవలం బాలికలు ఉద్యోగం పొందేందుకు తోడ్పడటం మాత్రమే కాదు, అదే సమయంలో పాఠశాల విద్య ఆపేసిన బాలికలు తమంతట తాము సంపాదించుకోగలరనే భరోసానూ అందిస్తుంది’’ అని అన్నారు.

 
ఈ సందర్భంగా శ్రీ మోహన్‌దాస్‌ పాయ్‌, ఛైర్మన్‌, మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ మాట్లాడుతూ, ‘‘మహిళను విద్యావంతులను చేస్తే వారి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను వారు ధైర్యంగా అధిగమించేందుకు తోడ్పడుతుంది.  మనమంతా ఇప్పుడు విస్తృతస్థాయి డిజిటల్‌ పరివర్తన మార్గంలో ఉన్నాము. ఇంటర్నెట్‌తో డిజిటల్‌ అభ్యాస వేదికలు మరియు మొబైల్‌ ఫోన్‌ ఆఫరింగ్స్‌కు అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి.

 
మహిళలకు అదనపు ఆదాయం మరియు మెరుగైన ఉద్యోగావకాశాలు లభించేందుకు సైతం తోడ్పడుతున్నాయి. మహిళా అక్ష్యరాస్యత, ఉద్యోగాలలో మహిళలు పాల్గొనడం,  ఆర్థిక సమ్మిళితత వంటివి ఆర్ధిక పురోగతిలో అత్యంత కీలకమైన విభాగాలుగా దేశంలో నిలుస్తున్నాయి మరియు విద్య అనేది వీటికి మూలస్తంభంగా ఉంటుంది. సాధికారిత దిశగా ఇది చక్కటి తోడ్పాటును అందిస్తుంది. అన్‌అకాడమీ ప్రారంభించిన ఈ కార్యక్రమం మరిన్ని స్టార్టప్స్‌కు  స్ఫూర్తినందించంతో  పాటుగా జాతి నిర్మాణంలో తోడ్పాటునందించనున్నాయి’’ అని అన్నారు.

 
‘‘అన్‌అకాడమీ వద్ద, మా లక్ష్యమెప్పుడూ కూడా అత్యున్నత నాణ్యత కలిగిన విద్యను ప్రతి ఒక్కరికీ, వారి భౌగోళిక, ఆర్ధిక హోదాలతో సంబంధం లేకుండా అందించడం. మనం మన 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలలోకి అడుగుపెడుతున్న వేళ, మహిళా సాధికారిత అనేది సమాజంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సైతం అత్యంత కీలకంగా నిలుస్తుంది. సాంకేతిక ఆధారిత సామాజిక సమానత్వం మరియు విద్య అనేది రెండు శక్తి చోధకాలు అని మేము నమ్ముతున్నాము. అది మనల్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్ధిక వ్యవస్ధ దిశగా తీసుకువెళ్తుంది. శిక్షోదయతో, మేము ఈ మార్పుకు తోడ్పాటునందించాలనుకుంటున్నాము మరియు ఐదు లక్షల మంది బాలికలకు సాధికారిత కల్పించడం ద్వారా సామాజిక ప్రభావం తీసుకురావాలనుకుంటున్నాము’’అని అని గౌరవ్‌ ముంజాల్‌, కో–ఫౌండర్‌ అండ్‌ సీఈవొ, అన్‌అకాడమీ గ్రూప్‌ అన్నారు.

 
అన్‌అకాడమీ ఇప్పుడు బేటీ సంగ్‌ బులందీ కీ ఓర్‌కు తమ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. శిక్షోదయ  పేరిట విడుదల చేసిన చిత్రంను సైతం నేడు ఢిల్లీలో జరిగిన  కార్యక్రమంలో  విడుదల చేశారు. ఈ చిత్రంలో ఏ విధంగా అన్‌అకాడమీ బాలికలు తమ కలలను సాకారం చేసుకోవడంలో సహాయపడింది. వారు నాణ్యమైన విద్యను ఏ విధంగా పొందగలిగారన్నది వెల్లడించారు.

 
ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ ప్రభుత్వ అధికారులు, సీనియర్‌ నాయకులు అయిన శ్రీ అమితాబ్‌ కాంత్‌, సీఈఓ, నీతి ఆయోగ్‌; శ్రీ సోమ్‌ ప్రకాష్‌, వాణిజ్య మరియ పరిశ్రమల శాఖ సహాయమాత్యులు; జీఓఐ డాక్టర్‌ సంధ్య చింతల, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌ ఎస్‌ఎస్‌సీ; ప్రొఫెసర్‌అనిల్‌  సహస్రబుద్ధి, ఛైర్మన్‌, ఏఐసీటీఈ, జీఓఐ శ్రీ మోహన్‌దాస్‌ పాయ్‌, ఛైర్మన్‌, ఆరిన్‌ క్యాపిటల్‌ మరియు ఛైర్మన్‌- మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌, శ్రీమతి కాంతా సింగ్‌, ఇండియా హెడ్‌-యుఎన్‌ ఉమెన్‌ ఉన్నారు.