1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (09:58 IST)

వామ్మో.. రీ రిజిస్ట్రేషన్‌కు 8 రెట్లు ఫీజు వసూలు

Cars
ఏప్రిల్ 1 నుంచి రీ రిజిష్ట్రేన్‌కు 8 రెట్లు ఫీజు వసూలు చేయనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. 15 ఏళ్లు దాటిన పాత వాహానాలకు రీ రిజిష్ట్రేషన్, ఫిట్ నెస్ చార్జీలను భారీగా పెంచుతూ ఈ ముసాయిదా నోటిఫికేషన్ జారీ అయ్యింది. 
 
ప్రస్తుతం ద్విచక్ర వాహనాల రీ-రిజిస్ట్రేషన్‌కు రూ.300 వసూలు చేస్తున్నారు. ఇక నుంచి రూ.1,000 వసూలు చేయనున్నారు. కార్లకు రూ.600కు బదులుగా రూ.5,000 వసూలు చేస్తారు. దిగుమతి చేసుకున్న కార్లకు రూ.15,000కు బదులుగా రూ.40,000 వసూలు చేస్తారు.
 
15 ఏళ్ల రిజిస్ట్రేషన్‌ గడువు దాటిన వ్యక్తిగత వాహనాలను తిరిగి రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం ఆలస్యమైతే వారి వద్ద నుంచి నెలకు రూ.300 చొప్పున అదనంగా వసూలు చేస్తారు. 
 
వాణిజ్య వాహనాలకు నెలకు రూ.500 వసూలు చేస్తారు. 15 ఏళ్లు దాటిన వాహనాలు ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి రీ-రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.