మంగళవారం, 22 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 1 జులై 2025 (18:39 IST)

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

Mahavatar Narasimha poster
Mahavatar Narasimha poster
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ క్లీమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి ప్రతిష్టాత్మకమైన, సెన్సేషనల్ వెంచర్ - మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) సంయుక్తంగాచేస్తున్నారు. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీ విష్ణువు దశ అవతారాల పురాణ గాథను జీవం పోస్తుంది. ఇది అత్యాధునిక యానిమేషన్, భారతీయ పురాణాల బేస్డ్  కంటెంట్‌లో ఇంతకు ముందు ఎన్నడూ ప్రయత్నించని సినిమాటిక్ స్కేల్ తో అలరించబోతోంది.

దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలు నిర్మిస్తున్న మహావతార్ నరసింహ, మొదటి భాగం జూలై 25, 2025న ఐదు ప్రధాన భారతీయ భాషలలో అత్యాధునిక 3D ఫార్మాట్‌లో విడుదల కానుంది.
 
తాజాగా విడుదలైన ప్రోమో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టే ప్రమాదం ఉన్న హిరణ్యకశిపును పరిచయం చేస్తుంది. కళ్లు చెదిరే విజువల్స్, అద్భుతమైన సంగీతం, కాలాన్ని ప్రతిధ్వనించే పౌరాణిక వైభవంతో ఈ ప్రోమో అధర్మం రాజ్యమేలుతున్న యుగం యొక్క తీవ్రతను ప్రజెంట్ చేస్తోంది.
 
అత్యాధునిక VFX, 3D విజువల్స్ , పవర్ ఫుల్ బీజీఎంతో, మహావతార్ నరసింహ భారతీయ సినిమాలో పౌరాణిక కథ చెప్పే స్కేల్ ని రీడిఫైన్ చేస్తోంది. ఇది డివైన్ యూనివర్స్, విష్ణువు దశ అవతారాల అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది