సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (13:21 IST)

అన్నవరం బ్యాంకులో అగ్ని ప్రమాదం.. డబ్బు సేఫ్

అన్నవరం బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా అన్నవరం యూనియన్ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో డబ్బులు, పత్రాలు భద్రపరిచే లాకర్‌ సురక్షితంగా ఉన్నట్టుగా సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 
 
బ్యాంకు నుంచి మంటలు వ్యాపించడం చూసిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి  తీసుకురావడానికి యత్నించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి.