శనివారం, 23 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:37 IST)

క‌రోనాతో న‌ష్టాల్లో రామ్‌చ‌ర‌ణ్ వ్యాపారం!

Ramcharan, TruJet Domestic Airlines
క‌రోనా వ‌ల్ల ఎంతోమంది త‌మ త‌మ వృత్తులు, వ్యాపారాలు దెబ్బ‌తిన్నాయి. ఇప్పుడు అదే కోవ‌లో రామ్‌చ‌ర‌ణ్ ఆమ‌ధ్య ట్రూజెట్‌ పేరుతో డొమాస్టిక్‌ ఎయిర్‌లైన్‌ బిజినెస్‌ స్టార్ట్ చేశాడు. అది ఇప్పుడు మూసి వేస్తున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కార‌ణం న‌ష్టాల్లో వుండ‌డ‌మే. 2015లో రామ్ చరణ్‌ తన స్నేహితుడితో క‌లిసి ఈ వ్యాపారంలోకి దిగాడు. కాగా,  ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

 
దీనిపై నేరుగా ఆ సంస్థ యాజ‌మాన్యం న‌ష్టాల్లో వుంద‌ని చెప్ప‌డంలేదు. ట్రూజెట్ కంపెనీ స్పందిస్తూ అడ్మినిస్ట్రేటివ్ గా, సాంకేతిక కారణాల వల్ల తమ సంస్థ కార్యకలాపాలకు తాత్కాలిక ఆటంకం ఏర్పడిందని త్వరలో పునఃప్రారంభిస్తామని ట్రూజెట్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.


ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదని వినబడుతున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, పాక్షిక జీతాలు ఇస్తున్నామని, తక్కువ జీతం అందుకుంటున్న ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చామని తెలిపారు. దీనిని బ‌ట్టి కార‌ణాలు ఏమైనా క‌రోనా వ‌ల్ల ఇత‌ర రంగాల్లో పూర్తి జీతాలు ఇవ్వ‌కుండా జ‌రిగిన ప‌రిస్థితే ఇప్పుడు దీనికి వ‌చ్చిన‌ట్ల‌యింది.