గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (08:08 IST)

ఆచార్య విడుద‌ల తేదీలో మార్పు రాబోతోంది !

Megastar Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా `ఆచార్య‌`. ఈ సినిమా అన్ని అనుకూలిస్తే ఫిబ్ర‌వ‌రి 25నే విడుద‌కాల‌వాల్సివుంది. కానీ క‌రోనా మూడో వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల స‌మ‌స్య‌ల‌తో ఈ సినిమాను పెద్ద సినిమాల త‌ర‌హాలో వాయిదా వేశారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌లో థియేట‌ర్ల ప‌రిస్థితి మెరుగైంది. ఇక తాజాగా త‌న సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల‌చేయాల‌ని మెగాస్టార్ నిర్ణ‌యించార‌ట‌. అందుకే పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను ఈ గేప్‌లో చాలా మార్పులు చేసి ముగించారు. 
 
ఇంత‌కుముందు  ఏప్రిల్ 1న రిలీజ్ కి నిర్మాత‌లు ఫైనల్ చేశారు. కొంద‌రు ఏప్రిల్ ఫూల్ డేనాడా! అంటూ కామెంట్లు చేయ‌డం జ‌రిగింద‌ని తెలిసింది.  తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రో తేదీని ప్ర‌క‌టించేందుకువ సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. హిందీకి సంబంధించిన ప‌నులు కొద్దిగా మిగిలివున్నాయి. డ‌బ్బింగ్ చిరంజీవే చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న సినిమాలు డ‌బ్ అయ్యేవి. ఇప్పుడు యువ హీరోల సినిమాల‌న్నీ బాలీవుడ్‌లో ఆడి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందుకే పాన్ ఇండియా లెవ‌ల్లో విడుద‌ల‌చేస్తున్నారు.
 
కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నాయిక‌లుగా న‌టించిన ఈ సినిమాకు కొరటాల శివ ద‌ర్శ‌కుడు.  మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది.