మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:48 IST)

కాజల్ అగర్వాల్‌కు యూఏఈ గోల్డెన్ వీసా

టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్‌కు గోల్డెన్ వీసా వరించింది. యూఏఈ ప్రభుత్వం అందజేసే ఈ వీసా అతి కొద్దిమందికి మాత్రమే ప్రదానం చేస్తుంది. దీనిపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ, యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా ఆదుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. 
 
యూఏఈ అందించే ఈ గోల్డెన్ వీసా ఉంటే విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ షిప్ అవసరం లేకుండానే యూఏఈలో ఉద్యోగాలు చేసుకోవచ్చు. నివసించడానికి వీలు పడుతుంది. అంతేకాకుండా, గోల్డెన్ వీసా ఉన్నవారిని యూఏఈ ప్రభుత్వం సొంత పౌరులుగా పరిగణిస్తుంది. గోల్డెన్ వీసా కలిగినవారు సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. 5, 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్నప్పటికీ ఈ వీసా ఆటోమేటిక్‌గా రెన్యువల్ అవుతుంది.