మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (17:16 IST)

అన్నింటికీ క‌లిపి కోటి తీసుకున్న‌ నిది అగ‌ర్వాల్‌

Nidi Agarwal
న‌టి అగ‌ర్వాల్ సినిమాకు భారీ మొత్తాన్ని అడిగేసింది. తాజాగా గ‌ల్లా జ‌య‌దేవ్ కుమారుడు గ‌ల్లా అశోక్ న‌టించిన `హీరో` సినిమాకు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆమెను సూచించారు. దానితో నిర్మాత‌లు ఆమెను అప్రోజ్ కాగా కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌లు పారితోషికం అడిగిందని తెలిసింది. అందుకు ద‌ర్శ‌కుడు కోటి రూపాయల‌కు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య సెటిల్ చేశాడ‌ట‌. ఈ విష‌య‌మై ఇటీవ‌లే ఆయ‌న్ను ఓ సంద‌ర్భంగా అడిగితే, పారితోషికాలు గురించి త‌న‌కు పెద్ద‌గా తెలీద‌ని, ఆమె న‌ట‌నంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌నీ, చాలా నేచుర‌ల్‌గా న‌టిస్తుంద‌ని కితా బిచ్చాడు. 
 
సినిమాలో న‌టించాక త‌ర్వాత ప్ర‌మోష‌న్ కూడా రావాల్సిందిగా ఆమెతో ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాత‌లు. అమర్ రాజా మీడియా అండ్  ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. పెద్ద బేన‌ర్ కావ‌డంతో ఈ సినిమాకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇక సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న కామెంట్ల‌కు మొద‌ట బాధ‌ప‌డ్డాన‌నీ, ఆ త‌ర్వాత అల‌వాటైపోయింద‌ని నిధి చెప్పింది.