ఆదివారం, 25 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (15:59 IST)

న‌రేశ్ అంటే నాకు జ‌ల‌సీ - జ‌గ‌ప‌తి బాబు

Jagapathi Babu, naresh
నేను గ‌త 15 ఏళ్ళుగా థియేట‌ర్‌కు వెళ్ళ‌లేదు. ఈ సినిమాకోసం వెళ్ళి చూశాను. పెద్ద‌గా న‌వ్వని నేను ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశాను` అని జ‌గ‌ప‌తి బాబు తెలియ‌జేశారు. అశోక్ గ‌ల్లా, నిధి అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన సినిమా `హీరో`. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ప‌ద్మావ‌తి గ‌ల్లా నిర్మాత‌. ఇందులో జ‌గ‌ప‌తిబాబు కామెడీ చేయ‌డం విశేషం. ఈ చిత్ర అనుభ‌వాల‌ను ఆయ‌న ఇలా తెలియ‌జేస్తున్నాడు.
 
`మొద‌ట్లో `హీరో` సినిమా చేయ‌వ‌ద్ద‌ని అనుకున్నా. పెద్ద సినిమాల‌లో న‌టించిన నాకు కొత్త హీరో, చిన్న ద‌ర్శ‌కుడుతో చేయాల‌నిపించ‌లేదు. కానీ ప‌ద్మ‌వ‌తిగారు మా సోదిరికి ఒక‌టికి ప‌దిసార్లు ఫోన్ చేశారు. ఈ పాత్ర నేను చేస్తేనే బాగుంటుంద‌ని ఒప్పించారు. అయిష్టంగానే  చేశాను.  సినిమా చేసేట‌ప్పుడు నా పాత్ర పండుతుందా, లేదా అనే అనుమానం కూడా వుంది. కానీ ద‌ర్శ‌కుడు నా అంచనాల‌ను తారుమారు చేసి ప్రేక్ష‌కులు ఎంజ‌య్ చేసేలా చేశాడు. థియేట‌ర్‌లో స్పంద‌న చూశాక నేను చేసిన హ‌నుమాన్ జంక్ష‌న్ గుర్తుకువ‌చ్చింది. ఇలాంటివి తీయాలంటే ద‌ర్శ‌కుడు గొప్ప‌త‌నం చూపించాలి. హీరో అశోక్‌లో త‌ప‌న క‌నిపించింది. ఒక‌టికి రెండు సార్లు సీన్ బాగా వ‌చ్చేదాకా చేసేవాడు. 
 
ఇక న‌రేశ్ పాత్ర గురించి చెప్పాలి. నేనే విల‌న్‌గా క్రూరంగా క‌నిపిస్తాను. కానీ నాకంటే  క్రూరంగా న‌రేశ్ పాత్ర వుంది.  న‌రేశ్ చేస్తుంటే నాకు జ‌ల‌సీ క‌లిగంది. ఆయ‌న అంత‌లా ఆ పాత్ర చేసి మెప్పించాడు అని తెలిపారు.