మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు మృతి
Ramesh babu-krishna-mahesh
ప్రముఖ నటుడు మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌బాబు ఈరోజు రాత్రి మృతిచెందారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యం బారినడడ్డారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నఆయన ఇంటిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రమేశ్‌బాబు మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా వున్ననాటినుంచి బాలనటుడిగా ఆ తర్వాత హీరోగా రమేష్‌బాబు నటించారు. దొంగలకు దొంగ, నీడ, బ్లాక్ టైగర్ వంటి సినిమాలలో ఆయన నటించారు. 1974లో కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో యంగ్ అల్లూరిగా రమేష్‌బాబు నటించారు. దాదాపు 21 సినిమాలలో ఆయన నటించారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. అర్జున్, అతిథి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
కాగా, మహేష్‌బాబు విదేశాల్లో వున్నారు. కరోనా కూడా సోకింది. ఇలాంటి టైంలో వస్తారో రారో అని సందేహం కూడా వుంది. ఏదిఏమైనా కరోనా వల్ల కుటుంబం కలుసుకోకుండా చేసిందనే అభిమానులు భావిస్తున్నారు.