శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (17:47 IST)

నిధి అగ‌ర్వాల్ ను గుర్తుప‌ట్ట‌లేని అందం ఇదే!

Nidhi Agarwal
హీరోయిన్లు మేక‌ప్ వేసుకుని బ‌య‌ట‌కు వ‌స్తే కిర్రాక్ పుట్టిస్తారు. షూటింగ్‌లో స‌న్నివేశప‌రంగా మేక‌ప్ మేన్ వేసిన మేక‌ప్‌తో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటారు. మేక‌ప్ తీస్తే ఎవ‌రైనా అంతే. ముఖ్యంగా హీరోయిన్లు చాలామంది అస‌లు మేక‌ప్ లేకుండా చూడాలంటే గుర్తుప‌ట్ట‌డం క‌ష్టం. రోడ్డుమీద న‌డ‌చుకుంటూ వెళ్ళినా ఎవ్వ‌రూ గుర్తుప‌ట్ట‌రు. కానీ మ‌రో మ‌నిషి ప‌క్క‌న వుంటే ఈమెను ఎక్క‌డో చూసిన ఫీలింగ్ క‌లుగుతుంది. తాజాగా హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కు ఇలాంటి అనుభ‌వం ఎదురైంది.
 
ఆమె ఇటీవ‌లే సంక్రాంతికి న‌టించిన సినిమా `హీరో`. విడుద‌లైంది. ఈ సినిమాలో చాలా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంది. సినిమా విజ‌య‌వంతంగా ఆడుతున్న సంద‌ర్భంగా కొన్ని ప్రాంతాల‌లో టూర్‌ను నిర్వ‌హించారు. అంత వ‌ర‌కు యూనిట్‌తోపాటు గ్లామ‌ర్‌గా వుండ‌డంతో ఆమెతో ఫొటోలు దిగ‌డానికి యువ‌త ఆస‌క్తి చూప‌డం స‌హ‌జం. శుక్ర‌వారంనాడు హీరో టీమ్‌తో క‌లిసి తిరుమ‌ల ద‌ర్శినం చేసుకుంది. మొద‌ట‌గా ఆమె బ‌య‌ట‌కు రాగానే ఎవ‌రో అనుకుని మీడియా ప‌ట్టించుకోలేదు. ఎందుకంటే మొహానికి మేక‌ప్ కూడా లేకుండా నాచుర‌ల్‌గా వుండ‌డ‌మే కార‌ణం. ఆ త‌ర్వాత గుడి బ‌య‌ట‌కు గ‌ల్లా జ‌య‌దేవ్‌, అశోక్‌, గ‌ల్లా ప‌ద్మావతిని చూడ‌గానే వారంతా కెమెరాల‌కు ప‌నిచెప్పారు. అప్పుడు గ్రూపులో జాయిన్ కాగానే నిధి అగ‌ర్వాల్ అంటూ అక్క‌డివారు గుర్తుప‌ట్టారు. మేక‌ప్ లేక‌పోతే ఇలా వుంటుందా! అంటూ చెప్పుకోవ‌డం విశేషం.