శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ , శుక్రవారం, 21 జనవరి 2022 (15:37 IST)

బంగార్రాజు హిట్ తో తిరుమ‌లేశుని ద‌ర్శించుకున్న అక్కినేని నాగ్, అమ‌ల‌

బంగార్రాజు...సోగ్గాడు మ‌ళ్ళీ వ‌చ్చాడు సినిమా హిట్ కావ‌డంతో అక్కినేని నాగార్జున హ్యాపీగా ఉన్నాడు. త‌న‌తోపాటు కుమారుడు నాగ చైత‌న్య‌కు ల‌వ్ స్టోరీతో మ‌ళ్లీ బ్రేక్ రావ‌డం ఆయ‌న‌కు పిచ్చ హ్యాపీని ఇచ్చింది. ఇక స‌మంత‌తో చైతు బ్రేక్ అయిన త‌ర్వాత వ‌రుస‌గా ల‌వ్ స్టోరీతోపాటు, బంగ‌ర్రాజు కూడా హిట్ కావ‌డంతో నాగ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటూ, ఈ రోజు ఆ మొక్కుబ‌డి తీర్చుకున్నాడు నాగ్.
 
 
తిరుమల శ్రీవారిని  సినీ హీరో నాగార్జున, అమల దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి‌ విరామ సమయంలో  స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి‌ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారిని దర్శనానికి వచ్చి రెండు సంవత్సరాలు అయింద‌ని, ఈ రోజు తిరుమలేశుని ద‌ర్శ‌నం త‌న‌కు ఎంతో సంతృప్తిని ఇచ్చింద‌ని నాగ్ చెప్పాడు.  ఈ క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో  అందరూ బాగుండాలని స్వామి వారిని కోరుకుంటున్నామ‌ని నాగ్, అమ‌ల చెప్పుకొచ్చారు.