గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (19:38 IST)

ఈ సినిమా మిస్ కాకూడ‌ద‌ని చేశా - అక్కినేని అమ‌ల

Akkineni Amala, Sarvanandh, Sri Karthik
శర్వానంద్ న‌టించిన కొత్త చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తిక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ని హైద‌రాబాద్ ఎ.ఎం.బి. మాల్‌లో విడుద‌ల చేశారు. శ‌ర్వానంద్‌కు త‌ల్లిగా అమ‌ల న‌టించారు. 
 
ఈ సంద‌ర్భంగా అక్కినేని అమ‌ల మాట్లాడుతూ, ఈ సినిమాలో అంద‌రికీ అమ్మ అయిపోయాను. చాలా గౌర‌వంగా భావిస్తున్నాను. ఒకే ఒక జీవితంలో న‌టించ‌డం ఆనందంగా వుంది. క‌థ చెప్పిన‌ప్పుడే నేను చేయాల‌ని అన్నాను. మిగిలిన సినిమాలు చేసినా చేయ‌క‌పోయినా ఇటువంటి సినిమా చేయాల‌నిపించింది. ఇప్ప‌టి త‌రం మంచి కంటెట్‌తో ముందుకు వ‌స్తున్నారు. శ‌ర్వానంద్ బాగా న‌టించాడు. ఈ సినిమా మిమ్మ‌ల్ని ఎంజాయ్ చేసేలా చేస్తుంది అని చెప్పారు. 
 
కాగా, ఈ సినిమాలో అమ్మ‌పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు.