శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (19:17 IST)

థియేటర్‌లో తన ప్రేమికుడితో నయనతార

Nayantara, Vignesh Sivan
త‌మిల‌నాడులో న‌య‌న‌తార గురించి తెలియంది కాదు. ఆమెకు ఎంతోమంది అభిమానులు వున్నారు. ఆమె ఎక్క‌డి వెళ్ళినా వేయిక‌ల్ళ‌తో ఎదురుచూసే కెమెరాలు కూడా వున్నాయి. ఆమె త‌న ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి చెన్నైలో ఎస్కేప్ మాల్ లో రాకీ చిత్రాన్ని వీక్షించారు. ఇంకేముంది వారు చాలా హాట్ టాపిక్ గా మారారు. వారు థియేట‌ర్‌లో కూర్చున్న ఫొటోల‌ను సినిమాలోకి వెళుతున్న పిక్‌ల‌ను న‌య‌న‌తార త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్‌చేసింది. ఈరోజే వెళ్ళి సినిమా చూశాన‌ని పేర్కొంది. 
 
Nayantara, Vignesh Sivan
త‌న సోష‌ల్ మీడియాలోనే లేడీ సూపర్ స్టార్ నయనతార అంటూ అభిమానులు పిలుచుకుంటుంటారు. న‌య‌న‌తార సినిమాలు చేస్తూనే రౌడీ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసింది. ఇందులో ఇద్ద‌రూ పార్ట‌న‌ర్ష్.తాజాగా విగ్నేష్ దర్శకత్వంలో వసంత్ రవి నటించిన చిత్రం ‘రాకీ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఈరోజు  ఇద్ద‌రూ థియేట‌ర్‌లో సినిమా చూసి ప్రేక్ష‌కుల‌కు సంద‌డి చేశారు.