ఎన్టీఆర్‌ది చైల్డ్ మెంటాలిటి - లయన్ పర్సనాలిటి : రామ్ చరణ్
తన సహచర నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తనకు మధ్య ఉన్న అనుబంధం, స్నేహబంధంపై హీరో రామ్ చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తారక్‌ది చైల్డ్ మెంటాలిటీ - లయన్ పర్సనాలిటీ అని అన్నారు. అందుకే తారక్‌తో ఉన్న తన్న స్నేహబంధాన్ని చనిపోయేంత వరకు గుర్తుపెట్టుకుంటానని అన్నారు.
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" చిత్రం వచ్చే నెల 7వ తేదీన విడుదలకానుంది. మొత్తం ఐదు భాషల్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. దీంతో ఒక్కో భాషలోనూ ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా సోమవారం రాత్రి చెన్నైలో జరిగిన ప్రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత డీవీవీ దానయ్య, రాజమౌళి, ఎన్టీఆర్, రాం చరణ్, కోలీవుడ్ హీరోలు శివకార్తికేయన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
ఇందులో హీరో రామ్ చరణ్ మాట్లాడుతూ, "ఆర్ఆర్ఆర్" ప్రయాణం నాకు ఎన్టీఆర్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను చనిపోయేంత వరకు ఎన్టీఆర్‌తో నా అనుబంధం ఇలానే కొనసాగుతుందన్నారు. ఎన్టీఆర్‌ది మానసికంగా చిన్నపిల్లాడి మనస్తత్వం.. కానీ వ్యక్తిత్వం విషయానికి వస్తే సింహంలాంటి వాడని చెప్పుకొచ్చాడు. అలాగే, ఎన్టీఆర్ మాట్లాడుతూ, తనకు చెర్రీకి చాలా సాన్నిహిత్యం వుందన్నారు. అతన్ని సోదరుడిలా భావిస్తానని చెప్పారు.